శవదహనం గురించి బైబిలు ఏం చెప్తుంది?

0
6
శవదహనం గురించి బైబిలు ఏం చెప్తుంది?

బైబిలు ఇచ్చే జవాబు: శవదహనానికి సంబంధించిన స్పష్టమైన నిర్దేశం ఏదీ బైబిల్లో లేదు. చనిపోయినవాళ్లను పాతిపెట్టాలనే లేక దహనం చేయాలనే ఆజ్ఞ కూడా బైబిల్లో లేదు.
అయితే బైబిల్లో, దేవుని నమ్మకమైన సేవకులు తమ ప్రియమైనవారి మృతదేహాల్ని పాతిపెట్టిన వృత్తాంతాలు ఉన్నాయి. ఉదాహరణకు, అబ్రాహాము తన భార్యయైన శారా మృతదేహాన్ని పాతిపెట్టే స్థలాన్ని సంపాదించడానికి ఎంతో కృషిచేశాడు.—ఆదికాండము 23:2-20; 49:29-32.బైబిల్లో, నమ్మకమైన సేవకులు మృతదేహాల్ని దహించిన వృత్తాంతాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, ఇశ్రాయేలు రాజైన సౌలు, ఆయన ముగ్గురు కుమారులు యుద్ధంలో చనిపోయారు. అయితే వాళ్ల మృతదేహాలు శత్రుదేశంలో ఉన్నాయని, శత్రువులు వాటిని అగౌరవపరుస్తున్నారని ఇశ్రాయేలు నమ్మకమైన యోధులకు తెలిసింది. దాంతో వాళ్లు సౌలు, ఆయన కుమారుల మృతదేహాల్ని తీసుకొచ్చి, వాటిని దహించి, అవశేషాల్ని పాతిపెట్టారు. (1 సమూయేలు 31:8-13) ఆ పద్ధతి ఆమోదయోగ్యమైనదేనని బైబిలు సూచిస్తోంది.—2 సమూయేలు 2:4-6.