శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటి..?

0
6
శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి కారణం ఏమిటి..?

నెల్లూరు న్యూస్‌టుడే: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోటంరెడ్డి శ్రీదర్ రెడ్డిపై వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్ కు తరలించేందుకు శ్రీధర్ రెడ్డిని జీవులో తీసుకెళుతున్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు పలువురు అనుచరులు కె.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద పోలీసు వాహనాలు ఎదుట బైఠాయించారు. బైఠాయించిన గుంపును చెల్లాచెదురు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
డెస్క్: రెడ్డి