ఎవరు తిరుమలకు వచ్చినా గరిష్ఠంగా ఐదారు గంటల్లోపే దర్శనం………

0
3
ఎవరు తిరుమలకు వచ్చినా గరిష్ఠంగా ఐదారు గంటల్లోపే దర్శనం………

తిరుమల:(టిన్యూస్10):న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు

  • పాత విధానాలను రద్దు చేస్తాం
  • స్వార్థపూరిత నేతల కారణంగానే దర్శనంలో జాప్యం
  • భక్తులకు శీఘ్రదర్శనమే లక్ష్యమన్న సుబ్బారెడ్డి

                    వివరాల్లోకి వెళితే…ఇకపై ఏ సామాన్య భక్తుడు తిరుమల శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి వచ్చినా గరిష్ఠంగా ఐదారు గంటల్లోగానే దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలియజేశారు. చిత్తూరు జిల్లా ఆనందగిరి పాళ్యం కొండపై ఉన్న దేవసేన సమేత కల్యాణ సుబ్రహ్మణ్యస్వామి ఆలయ ప్రాంగణంలో రూ. 96 లక్షలతో నిర్మించిన టీటీడీ గెస్ట్ హౌస్ ను ప్రారంభించిన ఆయన, మీడియాతో మాట్లాడారు. గతంలో కొందరు స్వార్థ అధికారులు, రాజకీయ నేతల కారణంగానే భక్తులకు స్వామివారి దర్శనంలో జాప్యమవుతోందని ఆరోపించారు. పాత విధానాలను రద్దు చేసి, భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించేందుకు చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. పట్టణాల్లో సైతం గ్రామాల్లో సైతం టీటీడీ వసతి గృహాలు ఏర్పాటు చేస్తామని, కల్యాణ మండపాల్లో శ్రీవారి విగ్రహాలు పెట్టించి, నిత్య ధూప దీపారాధనకు ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డితో పాటు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.