ఆ ఫ్యామిలీలో ఎవరు టచ్ చేసినా వెలుగుతున్న బల్బ్!

0
5
ఆ ఫ్యామిలీలో ఎవరు టచ్ చేసినా వెలుగుతున్న బల్బ్!

అదిలాబాద్: (టిన్యూస్ 10)న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు….   

  • పవర్ ప్యాక్ వ్యక్తులు…  
  • శరీరంలో ఏ భాగంలో అయినా..తగిలించిన వెంటనే వెలుగుతున్న బల్బ్…   
  • పక్కింటి వారు పట్టుకుంటే మాత్రం వెలగటం లేదు…     

                    వివరాల్లోకి వెళితే ….ఇప్పుడో విచిత్రమైన కుటుంబం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదిలాబాద్ జిల్లా బేల మండలం సిర్సన్న గ్రామానికి చెందిన కుటుంబం ఇప్పుడు సైన్సు కే కొత్త ప్రశ్నలు వేసేలా మారింది. ఆ ఇంట్లోని కుటుంబ సభ్యులంతా పవర్ ప్యాక్ వ్యక్తులుగా మారారు. వారు ముట్టుకుంటే చాలు ఎల్ ఈడీ బల్బ్ లు వెలుగుతున్నాయి.ముక్కు.. నుదురు.. చేయి.. కాలు.. శరీరంలో ఏ భాగంలో అయినా.. ఎల్ ఈడీ బల్బ్ ను తగిలించిన వెంటనే అది వెలుగుతోంది. షేక్ చాంద్ పాషా వారం క్రితం ఎల్ ఈడీ బల్బుల్ని కొన్నాడు. అయితే..  బల్బ్ ను తాకగానే.. కరెంట్ పాస్ అయినట్లుగా వెలిగింది  ఇదే బల్బ్ ను పక్కింటి వారు పట్టుకుంటే మాత్రం వెలగటం లేదు.దీంతో ఈ వింత విషయం గ్రామంలో సంచలనంగా మారి.. అందరూ చాంద్ పాషా ఇంటికి క్యూ కడుతున్నారు.