చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందా.?

0
3
చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందా.?

న్యూస్‌టుడే:

ఏపీలో డ్వాక్రా మహిళల ఓట్లు చాలా కీలకం. దాదాపు కోటి వరకు ఉంటారు డ్వాక్రా మహిళలు. ఈ ఓట్లు మొత్తం గంపగుత్తగా ఎవరికి పడితే.. వాళ్లు ముఖ్యమంత్రి అయినట్లే. అందుకోసమే.. ముందుస్తు వ్యూహంలో భాగంగా ఎన్నికల సమయానికి డ్వాక్రా మహిళల ఎక్కౌంట్ లో డబ్బులు పడేలా చంద్రబాబు ప్లాన్ చేశారు. కానీ బ్యాంకులకు వరుసగా సెలవలు రావడంతో అది వర్కవుట్ కాలేదనే భయం చంద్రబాబుకి వచ్చేసింది. దీంతో.. తాను ముఖ్యమంత్రి అయితే..  ఇకనుంచి పసుపు కుంకుమ పథకం ఇచ్చే సొమ్ము మూడుసార్లు కాదు ఐదు సార్లు ఇస్తానని ప్రకటించారు చంద్రబాబు. అంతేకాదు నిన్నటికి నిన్న.. పసుపు కుంకుమ డబ్బులు మీ అక్కౌంట్లలో పడితే.. వాటిని మీ ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెట్టుకోండి అంటూ వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు ఏం మాట్లాడినా దానికి ఒక లెక్క ఉంటుంది. అసలు రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి ఇప్పటికిప్పుడు ఎలా ఉందో చంద్రబాబుకు తెలుసు. ఎలా చూసినా.. వైసీపీ గ్రాఫ్ రోజురోజుకి పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. దీంతో చంద్రబాబుకి ఓటమి భయం పట్టుకుందని.. అందుకే పథకాల కోసం ఎంత ఖర్చు పెట్టేందుకు అయినా వెనుకాడడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.                                                                                                                           డెస్క్: లక్ష్మీ