మాట కాదనేసరికి మృగంలా మారాడు…ఫేస్‌బుక్‌లో ఫోన్‌ నంబరిచ్చి మహిళకు వేధింపులు……

0
13
మాట కాదనేసరికి మృగంలా మారాడు…ఫేస్‌బుక్‌లో ఫోన్‌ నంబరిచ్చి మహిళకు వేధింపులు……

న్యూస్‌టుడే:ముఖ్యంశాలు…..

  • ఆమె  ఫేస్‌బుక్‌ ఖాతాలో అశ్లీల చిత్రాల పోస్టింగ్‌
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు
  • నిందితుడు, అతనికి సహకరించిన ముగ్గురి అరెస్టు

తనను పెళ్లి చేసుకోమని కోరితే కాదన్నదన్న ఆగ్రహంతో ఓ మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించిన వ్యక్తిని, అతనికి సహకరించిన ఇద్దరిని రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు…. ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌కు చెందిన వన్నల రాకేశ్‌(19), అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో స్నేహంగా ఉండేవాడు. పరిచయాన్ని ఆసరాగా చేసుకుని ఆమె ఫేస్‌బుక్‌ ఖాతా యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ తెలుసుకున్నాడు. ఆమెతో స న్నిహితంగా ఉండడాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని రోజుల తర్వాత పెళ్లి ప్రతిపాదన తెచ్చాడు.అందుకు ఆమె నిరాకరించడంతో బెదిరించాడు. ఆమె కేర్ చేయక పోవడంతో ఆమె ఫేస్‌బుక్‌ ఖాతాలోకి లాగిన్‌ అయ్యాడు. ఇంటర్నెట్ నుంచి సేకరించిన మహిళల నగ్నచిత్రాలను పోస్ట్‌ చేశాడు. బాధితురాలితోపాటు ఆమె కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లను అందులో పోస్ట్ చేశాడు. ఈ మొత్తం వ్యవహారానికి  అతని స్నేహితులు చింతకింది మహేశ్‌(23), ఎండీ గౌస్‌(21) సహకరించారు.రాకేశ్‌ ఫోన్ నంబర్లు ఇవ్వడంతో సదరు మహిళకు ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. దీంతో బాధితులు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ ఆశిష్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు రంగంలోకి దిగి ఇందుకు కారకులు రాకేశ్‌, మహేశ్‌,గౌస్‌లని తేల్చారు.  ముగ్గురినీ అరెస్ట్‌ చేశారు.