మహిళా సంఘాలే దిక్సూచి అన్నారు..కళా వెంకట్రావు

0
8
మహిళా సంఘాలే దిక్సూచి అన్నారు..కళా వెంకట్రావు
గుంటూరుజిల్లా:న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు..
.* పసుపు-కుంకుమను ప్రతిపక్షాలు అవమానించడం సిగ్గుచేటు….*2వేల 514 కోట్ల రూపాయలు మంజూరు….
వైఎస్ హయాంలో పావలావడ్డీకే రుణాలని చెప్పి…ప్రజలను అప్పులపాలు చేశారని విమర్శించారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. డ్వాక్రా సంఘ మహిళలకు మంత్రి బహిరంగ లేఖ రాసిన ఆయన పసుపు-కుంకుమను దేశం గర్వించే స్థాయిలో అమలు చేసి చూపించామన్నారు. ఆడపడుచులకు ఇచ్చే పసుపు-కుంకుమను ప్రతిపక్షాలు అవమానించడం సిగ్గుచేటుని మండిపడ్డారు. ఐదేళ్లలో 68 వేల కోట్ల రూపాయల వడ్డీలేని రుణాలు అందించామన్న కళా..వడ్డీ రాయితీగా ప్రభుత్వం 2వేల 514 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని తెలిపారు. ప్రభుత్వం పై నమ్మకంతో బ్యాంకులూ రుణాలిచ్చేందుకు ముందుకొచ్చాయని తెలిపారు. రుణాలు తీసుకున్న వారంతా అప్పులపాలయ్యారని ప్రచారం చేయటంపై ఆగ్రహించిన కళాఎవరి హామీలు, మేనిఫెస్టోలు మెరుగైనవో మహిళలే గమనించాలని సూచించారు.                                       డెస్క్:దుర్గ