జగన్ పై నిప్పులు చెరిగిన టీడీపీ నేత సాధినేని యామిని..

0
5
జగన్ పై నిప్పులు చెరిగిన టీడీపీ నేత సాధినేని యామిని..
అమరావతి న్యూస్‌టుడే:    ఆంధ్రప్రదేశ్ అప్పనంగా తన చేతిలోకి వచ్చేసిందని జగన్ కలలు కంటున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని విమర్శించారు. జగన్ కు ఒక్క అవకాశం ఇచ్చి మా పిల్లలను జైలు పాలు చేసుకోమంటారా? అని విజయమ్మను ఆమె ప్రశ్నించారు. ఏపీలో అవినీతి తాండవం చేయాలని కోరుకుంటున్నారా? అని నిలదీశారు. ఇప్పుడు వైఎస్ కుటుంబ సభ్యులు కూడా అలాగే ఉన్నారు.మామూలుగా కుటుంబంలో ఒకరో ఇద్దరో తేడా అనుకున్నాం. కానీ కుటుంబం మొత్తం మానసిక పరమైన తేడాను ఎదుర్కొంటున్నారు. మొన్న షర్మిల వచ్చి ఏదో మాట్లాడారు. నిన్న తల్లి విజయలక్ష్మిగారిని దింపారు. ఆవిడ ఒక చేతిలో బైబిల్ పట్టుకుని.. మరో చేతిలో మైక్ పట్టుకుని చెబుతూ . నా కొడుక్కి ఒక ఛాన్స్ ఇవ్వండి’ అని చెబుతున్నారు. మీ బిడ్డకు ఛాన్స్ ఇచ్చి మా పిల్లలను రోడ్డుపై పడేయాలా? జైలు పాలు చేయాలా?’ అని యామిని నిప్పులు చెరిగారు.