మీ ఓటు ఎక్కడికి పోదు కలెక్టర్ వి వి ….

0
14
మీ ఓటు ఎక్కడికి పోదు కలెక్టర్ వి వి ….
ఒంగోలు న్యూస్‌టుడే:
1.టీన్యూస్10 ఆన్‌లైన్ ఎడిషన్    
2.అక్రమాలకు పాల్పడితే జైలు శిక్ష: కలెక్టర్‌
3.ప్రతి దరఖాస్తు  మూడు దశల్లో విచారణ
ఓట్లు తొలగించాలంటూ ఫారం-7 దరఖాస్తులు అత్యధికంగా వచ్చిన విషయంపై ఆయన స్పందించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు.  ఓటర్లు భయపడాల్సిన పని లేదని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 86 వేల దరఖాస్తులు ఫారం-7 కింద నమోదయ్యాయని తెలిపారు. ఒక వ్యక్తి నుంచే 10, 20, 40 దరఖాస్తులొస్తే, ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. వీటిపై ఐపీ చిరునామా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అధిక సంఖ్యలో వచ్చిన దరఖాస్తులపై నిఘా ఉంచామని, అలాంటి వారిపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయని తెలిపారు. పర్చూరులో- మూడు, అద్దంకిలో-అయిదు, చీరాలలో- రెండు, సంతనూతలపాడులో- ఒకటి, గిద్దలూరులో- మూడు కేసులు నమోదయ్యాయని వివరించారు.అక్రమాలకు పాల్పడితే ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని కలెక్టర్‌ హెచ్చరించారు. నియోజకవర్గాల్లోనూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు వివరించారు.
                                                                                                            డెస్క్;కోటి & గౌస్