మోడీకి ప్రత్యేకంగా ట్వీట్ చేసిన వైఎస్ జగన్!

0
5
మోడీకి ప్రత్యేకంగా ట్వీట్ చేసిన వైఎస్ జగన్!

న్యూస్‌టుడే:ముఖ్యాంశాలు…

  • నేడు మోడీ 70వ జన్మదిన వేడుకలు
  • ట్విట్టర్ లో స్పందించిన వైఎస్ జగన్
  • జాతికి సేవ చేయాలన్న ఏపీ సీఎం

                             వివరాల్లోకి వెళితే…నేడు నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు జరుపుకుంటుండగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో విషెస్ పోస్ట్ చేశారు. “గౌరవనీయ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో చిరకాలం విజయవంతమైన జీవితాన్ని గడపాలని, జాతికి సేవ చేయాలని కోరుకుంటున్నాను” అని జగన్ వ్యాఖ్యానించారు. కాగా, 1950లో పుట్టిన మోదీ, నేడు తన 70వ పుట్టిన రోజును జరుపుకుంటుండగా, పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు.